హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలి టీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షంవ్యక్తంచేశారు. కాంగ్రె స్ అరాచకాలను ప్రజాస్వామ్యం ఓడించిందని శనివారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. బీ ఆర్ఎస్ సాధించిన ఘన విజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా అభివర్ణించారు.
నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసిన మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు బాల్క సు మన్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యువ నేత మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్(బంటి)తో పాటు అవిశ్రాంతంగా శ్రమించిన గులాబీ శ్రేణులకు ప్ర త్యేక అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారపార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా ఒక్కతాటి పై ఉన్న కౌన్సిలర్ల ధైర్యానికి కేటీఆర్ సెల్యూట్ చేశారు. తెలంగాణలో అణచివేతలు, బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు తావులేదని ఈ తీర్పు స్పష్టంగా తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ స ర్కార్పై ఉన్న ప్రజా వ్యతిరేకతకు అద్దంపట్టాయని కేటీఆర్ తెలిపారు. రెండున్నరేండ్ల పాలనలో పీకల్లోతు అక్రమాల్లో కూరుకొనిపోయిన కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో కౌంట్‌డౌన్ మొదలైందని స్పష్టంచేశారు.