హైదరాబాద్ : హైడ్రా(Hydraa) తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు కూల్చేందుకు మున్సిపల్ అధికారులు (Municipal authorities)సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మంలోని(Khammam) త్రీటౌన్ బీసీకే తోటలో అనుమతులు లేవంటూ ఇళ్లను కూలగొట్టేందుకు మున్సిపల్ అధికారులుప్రయత్నించారు. దీంతో కాలనీ వాసులు అధికారులకు ఎదురు తిరిగి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని తెలిపారు.
తమకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని, ఇంటి పన్ను, మున్సిపాలిటీ నీటి పన్ను, ఎలక్ట్రిసిటీ బిల్లులు కడుతున్నామని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు వచ్చి కూలగొడుతామంటే ఎలా అని ప్రశ్నించారు. నాడు అధికారులే అనుమతులిచ్చి ఇప్పుడు కూల్చివేస్తామనడం సరికాదన్నారు. కాలనీ వాసుల తిరుగుబాటుతో అధికారులు వెనుదిరిగారు.
ఖమ్మంలో హైడ్రా తరహా ఇళ్లు కూల్చేందుకు యత్నం.. ఎదురు తిరిగిన కాలనీ వాసులు
ఖమ్మం – త్రీటౌన్ బీసీకే తోటలో అనుమతులు లేవంటూ ఇళ్లను కూలగొట్టేందుకు యత్నించిన మున్సిపల్ అధికారులు.
50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, తమకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని, ఇంటి పన్ను, మున్సిపాలిటీ నీటి… pic.twitter.com/21RZ3criWU
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2024