మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మావోయిస్టుల కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించడమే లక్ష్యంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెలిమెల గ్రామ సమీపంలో ప్రజలు తిరిగే కాలి బాటల వెంబడి మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించారు. వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు.