Bathukamma | హైదరాబాద్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఆరు గ్యారంటీలు అమలు కాకపాయె ఉయ్యాలో.. అంటూ ముఖరా కే మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల ప్లకార్డులతో మహిళలు నిరసన తెలిపారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఉయ్యాలో,
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
ఆడపిల్లలకు స్కూటీలు ఉయ్యాలో,
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
4000 పింఛన్ ఉయ్యాలో,
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఉయ్యాలో,
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
ఆరు గ్యారంటీలు ఉయ్యాలో అంటూ ప్లకార్డులు పెట్టి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్న ఇంకా మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరని మండిపడ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి ఇంకా అమలు చేస్తలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు అమలు కానీ హామీలు ఇచ్చి మహిళలను మోసం చేసిందని, ప్రతీ వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో వచ్చి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులు చేసుడు దేవుడెరుగు కానీ ప్రతి మహిళకు నెలకు 2500,పెండ్లి అయిన ఆడ బిడ్డకు తులం బంగారం, పింఛన్ రూ. 4,000, డిగ్రీ చేసిన ఆడపిల్లకు స్కూటీలు వెంటనే ఇవ్వాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
ఆరు గ్యారంటీలు అమలు కాకపాయె ఉయ్యాలో..
అంటూ బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన ఆదిలాబాద్ జిల్లా, ముఖరా కే మహిళలు.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 6 గ్యారంటీలు అమలు కాకపాయె ఉయ్యాలో
అంటూ బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన మహిళలు, 6 గ్యారంటీల ప్లకార్డులు పెట్టి బతుకమ్మ ఆడి… pic.twitter.com/h19cEyT2sS— BRS Party (@BRSparty) September 18, 2025