హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంసెట్(బైపీసీ) షెడ్యూల్ విడుదలైంది. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వీ వెంకటరమణ, ఎస్కే మహ్మద్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. బీ ఫార్మసీ, ఫార్మా డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీలను వెల్లడించారు.
సెప్టెంబర్ 2,3న స్లాట్ బుకింగ్, 4,5న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 4 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్లు, 7న ఫ్రీజింగ్, 11న సీట్ల కేటాయింపు, 11 నుంచి 14 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 17న తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమై, 23న సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 24న స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్టు లింబాద్రి పేర్కొన్నారు.