2 నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్
ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మా - డీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
- ఈ ఏడాది రెండు విడతల్లో సీట్ల భర్తీ
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మా – డీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి, తుది విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభిస్తారు.
తాజా సమాచారం ప్రకారం 72 కాలేజీల్లో 2,473 బీ ఫార్మసీ, మరో 38 కాలేజీల్లో 412 ఫార్మా -డీ సీట్లున్నాయి. కాకతీయ వర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చేందుకు మూడు నాలుగు రోజులు పట్టవచ్చని అధికారులు తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను సెప్టెంబర్ 24న విడుదల చేస్తామని తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

