బొమ్మలరామారం, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆశయాలకు సీఎం రేవంత్‌రెడ్డి తూట్లు పొడుస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాలలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు స్థానంలో అంబేద్కర్ హస్తం పథకం ద్వారా రూ.12 లక్షల ఆర్థిక చేయూత అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ కనీసం ఎస్సీ కార్పొరేషన్‌కు రూపాయి మంజూరు చేయలేదని విమర్శించారు.