నిజాంపేట,అక్టోబర్15 : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అమలు అవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(కె) ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. భాగ్యలక్ష్మికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఈ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాయమాటలు చెప్పినా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
జరుగుతున్న అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, బీఆర్ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, దయాకర్, నందు, సిద్ధిరాములు, రమేశ్ తదితరులు ఉన్నారు.