హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి, దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మొకలు నాటేలా ఉత్తేజపరిచిన, ప్రభావితం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు (జీఐసీ) సంతోష్‌కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దకింది. పర్యావరణ సంరక్షణకు పాటుపడిన వారికోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురసారాన్ని బ్రిటన్ పార్లమెంట్లో ఆయనకు అందజేశారు.
లండన్‌లోని చారిత్రక హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో నిర్వహించిన ప్రపంచ వాతావరణ సంరక్షకుల సదస్సు (వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్క్లేవ్)లో సంతోష్‌కుమార్‌ను ఈ అవార్డుతో ఘనంగా సతరించారు. యునెసో వైస్ ప్రెసిడెంట్ నిక్ న్యూలాండ్, బ్రిటిష్ పార్లమెంట్ సీనియర్ సలహాదారు డేవిడ్ తాంప్సన్, కౌంటీ కౌన్సిల్ అడ్వైజర్ నికెల్ ఎడ్విన్ సహా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు, పలు దేశాల రాయబారులు.. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా సంతోష్‌కుమార్ సాధించిన ఫలితాలను కొనియాడారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, కోట్లాది మొకలు నాటేలా ప్రజలను భాగస్వాములను చేయడంలో ఆయన చూపిన చొరవ అద్భుతమని శ్లాఘించారు.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ప్రేరణ పొంది, సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. వసుదైక కుటుంబం నినాదంతో సామాన్యుల నుంచి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల వరకు అందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఇగ్నైటింగ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా లక్షలాది మందిలో పర్యావరణ స్పృహను పెంపొందించారు. కేవలం మొకలు నాటడమే కాకుండా, పట్టణ అడవుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 280 కోట్ల మొకలు నాటడం చరిత్రలోనే ఓ మైలురాయి.
పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో, ప్రతి ఒకరూ బాధ్యతగా మొకలు నాటాలని ఈ అవార్డు స్ఫూర్తిని ఇస్తున్నదని సంతోష్‌కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, రాబోయే తరాలకు పచ్చని భూమిని అందించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ‘ప్రకృతి హితం కోసం హరితహారం మాకు ఓ సంకల్పాన్ని అందించింది. అందులో నుంచే గ్రీన్ ఇండియా చాలెంజ్ పుట్టింది.
ఆ ఉద్యమంలో భాగంగానే గ్రామస్థాయి నుంచి కాస్మోపాలిటన్ నగరాల వరకు లక్షలాది మంది మొకలు నాటారు. హరిత ధరిత్రి కోసం ప్రతి ఒకరూ బాధ్యతగా మొకలు నాటాలనే భావనను గ్రీన్ ఇండియా చాలెంజ్ కలిగించింది. లక్షలాది మంది మైండ్ సెట్ మార్చగలిగింది. ఈ పురసారం మరిన్ని బాధ్యతలను గుర్తుచేసింది. ఈ గౌరవం నా ఒకడిది కాదు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములైన కోట్లాది మంది పర్యావరణ ప్రేమికులది. కేసీఆర్ నాటిన హరితహారం బీజమే ఈ రోజు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ అవార్డు నాపై బాధ్యతను మరింత పెంచింది’ అని సంతోష్‌కుమార్ చెప్పారు.