హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ శనివారం మొక్కను నాటి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ టోలిచౌకిలోని తన నివాసంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటి స్వాగతం పలకడం ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Did not find a better way to kick start the #NewYear than planting a sapling. Happy that I did my part with the hope that #NewYear2022 would be more promising amid pandemic. Let’s make Mother Earth more beautiful. #HappyNewYear.😊🎂#HaraHaiTohBharaHai🌳#GreenIndiaChallenge🌱 pic.twitter.com/ozCUwDMnUq
— Santosh Kumar J (@MPsantoshtrs) January 1, 2022