Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం: ఎంపీ సంతోష్ కుమార్
Green India Challenge | ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challenge) సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santosh Kumar )అన్నారు.
హైదరాబాద్ : ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challenge) సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santosh Kumar )అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని బంజారా హిల్స్ పార్క్లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
మర్రి, రావి, చింత వంటి మొక్కలను నాటడం ద్వారా వేగంగా పెరిగి వివిధ జాతుల పక్షులు, జంతువులకు నీడ, ఆశ్రయం కల్పిస్తాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టి గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా అనేక రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకులు కరుణాకర్, రాఘవ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

