హైదరాబాద్ : ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదే అంటూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను తీసుకొచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ తాజాగా మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త చాలెంజ్‌ను తీసుకొచ్చారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి మహిళ ఒక పండ్ల చెట్టును నాటేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క స్త్రీమూర్తి మొక్కను నాటి 9000365000 నెంబర్‌కు సెల్ఫీ ఫోటోను పంపించాలని సంతోష్ ట్వీట్ చేశారు.
తన జీవితమంతా నిస్వార్ధంగా ఫలాలను అందించే మొక్కలాగే.. ప్రతీ మహిళా త్యాగాలతో కుటుంబాల్ని నిలబెడుతుందని, అచంచలమైన ప్రేమను కురిపిస్తుందని, ఈ స్ఫూర్తికి ప్రతిరూపంగా ప్రతీ త్యాగమూర్తి మొక్కను నాటి తమ ఔన్నత్యాన్ని చాటాలని సంతోష్ కుమార్ కోరారు. మొక్కల్ని పెంచడం మనమంతా బాధ్యతగా స్వీకరించినప్పుడే పుడమి పచ్చగా ఉంటుందని, మానవ మనుగడతో పాటు సకల చరాచర జీవులు బతుకుతాయని ఆయన ట్వీట్ చేశారు. అందుకే మహిళా లోకానికి ప్రత్యేకమైన అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున స్త్రీమూర్తులంతా మొక్కలను నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
#InternationalWomensDay,
YOU have been phenomenal fulfilling your responsibilities. May I request all the women on 8th March to plant a sapling and take care of it as you have done to your family. #GreenIndiaChallenge wants you to take a selfie and share the same on 9000365000. pic.twitter.com/eAHQPOjfFE— Santosh Kumar J (@MPsantoshtrs) March 6, 2022