ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో కార్యక్రమం
ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలు నాటిన 30 మంది ఎంపీలు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యం తో బుధవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కరోల్‌బాగ్ జోన్ నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్కులో ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి ఆరు పార్టీలకు చెందిన వివిధ రాష్ర్టాల 30 మంది ఎంపీలు మొక్కలు నాటారు. యువ ఎంపీ సంతోష్‌కుమార్ ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని చేపట్టారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందించా రు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా గ్రీన్ ఇం డియా చాలెంజ్ విజయవంతం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఆకాంక్షించారు. ఢిల్లీలో తమ సంస్థ ఒక పార్కును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుందని రాంకీ సంస్థ చైర్మన్, ఎంపీ అయోధ్యరామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంపీలు కేశవరావు, రంజిత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాలోతు కవి త, వెంకటేశ్ నేతకాని, బడుగుల లింగయ్యయాదవ్, కేఆర్ సురేశ్‌రెడ్డి, పసునూరి దయాకర్, పీ రాములు, ఏపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్ సహా సంజయ్‌సింగ్ (ఆప్), బినోయ్ విశ్వం (సీపీఐ), అనిల్ దేశాయ్ (శివసేన), సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్ బలరామ్ పాల్గొన్నారు.
ప్రత్యేకంగా మొక్కలు నాటిన సంజయ్‌సింగ్, అనిల్ దేశాయ్ఈ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ వేర్వేరుగా మొక్కలు నాటారు.