హైదరాబాద్: నూతన సంవత్సరానికి ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh kumar) సరికొత్తగా స్వాగతం పలికారు. టోలిచౌకిలోని తన నివాసంలో మొక్కను నాటి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటడం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగమవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.