హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీని ఏర్పాటుకోసం రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ సిఫారసు చేసిందని గుర్తుచేశారు.
ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. వివిధ సా మాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, అత్యధిక జనాభా కలిగిన బీసీలకు మాత్రం మంత్రిత్వశాఖ లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఫలితంగానే బీసీ కు లాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిని సాధించలేకపోతున్నారని తెలిపారు. ప్రతి కు టుంబానికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలను ఇవ్వాలని కోరారు.