హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో(KCR bus yatra) రాష్ట్రంలో రాజయకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయని పేర్కొన్నారు. బస్సుయాత్రతో బీఆర్ఎస్కు తెలంగాణ అంతటా సానుకూల వాతావరణం ఏర్పడిందని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) బీఆర్ఎస్కు మంచి సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేశారని, తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీపై పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.