దుబ్బాక: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) దుబ్బాకలో (Dubbak) నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు చేరుకున్న ఆయన.. వీల్ చైర్లో వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు దుబ్బాక పట్టణంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. మిరుదొడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా చెపాల్య గ్రామానికి చెందిన గటాని రాజు.. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని పొత్తికడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ఆయనను హుటాహుటిన గజ్వేల్ దవాఖానకు తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం అక్కడికి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తీసుకెళ్లారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం దవాఖాన నుంచి అంబులెన్సులో దుబ్బాకకు వెళ్లారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన గటాని రాజుగా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు ఇటీవల బీజేపీ నాయకులతో సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఓపక్క రాజకీయం.. మరోపక్క యూట్యూబ్ చానల్ (వీ90 న్యూస్) రిపోర్టర్‌గా పని చేస్తున్నా డు. వివాదాస్పదుడిగా రాజుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కోచోట ఒక్కోరకంగా జర్నలిస్టునంటూ.. రాజకీయ నేతనంటూ పలువురిని బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి రాజుకు మధ్యన ఎలాంటి సంబంధాలు లేవు. ఎంపీని హత్య చేసేందుకు రాజును ఇతర రాజకీయ పార్టీల నాయకులు పురమాయించారా .. లేక పావుగా వాడుకున్నారా అనే సందేహాలు లేవనెత్తుతున్నాయి. సోమవారం దౌల్తాబాద్ మం డలం సూరంపల్లిలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రచారం ముగిసిన వెంటనే కవరేజీకి వచ్చిన స్థానిక పాత్రికేయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని అనుసరిస్తూ పాస్టర్ రం గయ్య ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని విష్ చేస్తున్నట్లు నటిస్తూ.. రాజు తన ప్యాంట్ జేబులో దాచుకున్న కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు.