జనగామ కలెక్టరేట్ అద్భుతం.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ప్రశంసలు
జనగామ : జనగామ నూతన కలెక్టరేట్‌ను అధునాతన సదుపాయాలతో అద్భుతంగా నిర్మించారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. జనగామ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఎంపీ కోమటిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎక్కడా లేని విధంగా నూతన కలెక్టరేట్లు నిర్మిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఈ విధంగా నిర్మించలేదు. జనగామ కలెక్టరేట్ భవనం అత్యంత అద్భుతంగా నిర్మించారు అని ఎంపీ కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జనగామ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
చేర్యాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎంను ఆయన కోరారు. జనగామకు మెడికల్, పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండింటిని సీఎం తప్పకుండా ఇస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. కరోనా కారణంగా రాష్ట్రానికి సరైన ఆదాయం లేకపోయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి మనం మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బస్టాండ్‌ను కూడా ఏర్పాటు చేయాలి. పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసి, సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించడం పట్ల సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

