హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు హైకోర్టులో చుకెదురైంది. అరవింద్‌పై బంజారాహిల్స్, అబిడ్స్ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో దర్యాప్తును ఎదురోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టంచేసింది. కేసులు కొట్టేయాలంటూ అరవింద్ దాఖలు పిటిషన్లను తోసిపుచ్చింది. పోలీసుల విచారణకు హాజరు నుంచి మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఒకవేళ హాజరు అవసరమని భావించి కింది కోర్టు ఉత్తర్వులు ఇస్తే హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. 2022లో అప్పటి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరవింద్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో రెండు కేసులు, అబిడ్స్ పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. వీటిని కొట్టేయాలంటూ హైకోర్టులో అరవింద్ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్ కేసులలోని అభియోగాల్లో తీవ్రత ఉన్నందున, విచారణను రద్దు చేయలేమని, కింది కోర్టులో కేసుల విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు.