ముమ్మరంగా సభ ఏర్పాట్లు
చలో నల్లగొండ బహిరంగసభకు పట్టణ శివారులోని నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- నల్లగొండలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): చలో నల్లగొండ బహిరంగసభకు పట్టణ శివారులోని నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సభా నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రధాన వేదిక, కళాకారుల వేదిక నిర్మాణం పూర్తి కావస్తుండగా గ్యాలరీల నిర్మాణం, బారి కేడింగ్, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయడం లాంటి పనులన్నీ చకచకా చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఆదివారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయుడు కంచర్ల కృష్ణారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు సభకు విస్త్రత ప్రచారం కల్పిస్తూ ప్రజలను కదిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ యావత్తు రంగంలోకి దిగింది. కృష్ణానదీ పరివాహాక ప్రాంతాలపై నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలతోపాటు తాగునీటిపై ఆధారపడిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరావచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

