హైదరాబాద్: జమ్ముకశ్మీరులోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడికి కారణం నిఘా వైఫల్యమేనని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఇది గతంలో జరిగిన యురి, పుల్వామా ఉగ్రవాద దాడుల కన్నా తీవ్రమైనదని, అత్యం త ప్రమాదకరమైనదని చెప్పారు.
‘ఉగ్రవాదులు పహల్గాంలో అమాయకులను వారి మతం గురించి అడిగి, విచక్షణ లేకుండా హత్య చేశారు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిఘా వైఫల్యం కూడా’ అని ఒవైసీ విలేకర్లకు చెప్పారు.