హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ కారణంగా సినీపరిశ్రమకు రూ.వందల కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిపారు.
ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కిరణ్ 2019 నుంచి 65 సినిమాలను పైరసీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. పైరసీ సినిమాలను పలు వెబ్సైట్లకు విక్రయించినట్టు వివరించారు. ఒక్కో సినిమా పైరసీకి రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు కిరణ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు అందినట్టు చెప్పారు.