ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 22: ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో ప్రముఖ సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని స్వాహా చేసేందుకు ఆయన ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. స్టేట్ ఆర్కియాలజీ విభాగం సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమి తనదేనని శివరామకృష్ణ క్లెయి మ్ చేసుకున్నారు. బిల్డర్ మారగోని లింగంగౌడ్ సహాయంతో ఆ భూమిలో పాగా వేశారు. దీనిపై 2003లో అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ప్ర భుత్వాలు మారినా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం కొనసాగింది. చివరికి శివరామకృష్ణ వద్ద ఉన్న డాక్యుమెంట్లు నకిలీవని సుప్రీంకోర్టు తేల్చడంతో ఆయనతోపాటు చంద్రశేఖర్, లింగంగౌడ్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.