Telangana | విస్తరణకు మోక్షమెప్పుడు?.. తెలుగు రాష్ట్రాలను కలిపే ఆ రహదారులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
తెలంగాణ, ఏపీని కలిపే రెండు ప్రధాన రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్హెచ్ 65)ను 6 లేన్లు, హైదరాబాద్-కల్వకుర్తి మార్గాన్ని 4 లేన్లకు విస్తరించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం పక్కన పెట్టింది.
- పదేైండ్లెనా కదలిక లేని ఎన్హెచ్-65, హైదరాబాద్-కల్వకుర్తి హైవేల ఎక్స్టెన్షన్
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీని కలిపే రెండు ప్రధాన రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్హెచ్ 65)ను 6 లేన్లు, హైదరాబాద్-కల్వకుర్తి మార్గాన్ని 4 లేన్లకు విస్తరించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం పక్కన పెట్టింది. దీంతో ఈ రెండు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఎన్హెచ్ 65పై ప్రస్తుతం రోజూ 50 వేలకుపైగా వాహనాలు తిరుగుతున్నట్లు టోల్ ప్లాజా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కానీ, రాష్ట్ర విభజన వల్ల ఈ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గిందని, దీంతో టోల్ ద్వారా తమకు వచ్చే ఆదాయం పడిపోయిందని కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ చెప్తున్నది. దీంతో ఈ రహదారిని 6 లేన్లకు విస్తరించడం సాధ్యంకాదని చేతులెత్తేసింది.
ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాలన్న ఒప్పందం అటకెక్కింది. దీంతో తెలంగాణ, ఏపీ రాజధానులను కలిపే ఈ మార్గంలో రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పండుగల సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్-కల్వకుర్తి మధ్య ప్రస్తుతమున్న ఎన్హెచ్-765ని నాలుగు లేన్లకు విస్తరించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, దీనికి అనుబంధంగా కల్వకుర్తి నుంచి కొల్లాపూర్, కరివెన మీదుగా ఏపీలోని నంద్యాల వరకు ఎన్హెచ్-167కే పేరుతో కొత్తగా హైవే నిర్మిస్తున్నది. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై మధ్య ప్రయాణ దూరం దాదాపు 80 కి.మీ. తగ్గుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల రీత్యా హైదరాబాద్ (ఓఆర్ఆర్) నుంచి కల్వకుర్తి (ఎన్హెచ్ 765) వరకు ఉన్న 2 లేన్ల రోడ్డును 4 లేన్లకు విస్తరించాలని వాహనదారు లు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయిస్తే తెలుగు రాష్ర్టాల వాహనదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ పట్ల కక్షతో ఈ ప్రాజక్టులను ముందుకు సాగకుండా చేసింది. దీంతో గత పదేండ్ల నుంచి ఈ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా ఇంతవరకు ఈ రెండు ప్రధాన రహదారులపై దృష్టి కేంద్రీకరించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

