Minister Errabelli | మదర్ థెరీసా సేవలు వెలకట్టలేనివి : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | గొప్ప మానవతామూర్తి, మానవాళి సంక్షేమానికి తన జీవితాన్ని దారపోసిన మదర్ థెరీసా సేవలు శ్లాఘనీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మదర్ థెరీసా వర్ధంతి సందర్భంగా కాజీపేట ఫాతిమా చౌరస్తాలో మదర్ థెరీసా విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.
వరంగల్ : గొప్ప మానవతామూర్తి, మానవాళి సంక్షేమానికి తన జీవితాన్ని దారపోసిన మదర్ థెరీసా సేవలు శ్లాఘనీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మదర్ థెరీసా వర్ధంతి సందర్భంగా కాజీపేట ఫాతిమా చౌరస్తాలో మదర్ థెరీసా విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడో మాసిడోనియాలో పుట్టి, మన దేశానికి వచ్చి, మిషనరీ సంస్థను పెట్టి, ఇక్కడి ప్రజలకు అమ్మలా సేవలు చేయడం గొప్ప విషయం అన్నారు.
మదర్ థెరీసా స్ఫూర్తితో మిషనరీ సంస్థలు కుల,మతాలకు అతీతంగా నిరుపేదలకు సాయం చేస్తున్నాయని, రానున్న రోజుల్లో వారి సేవలను ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు మరిన్ని అవసరం అయ్యే పనులను చేపట్టాలని మంత్రి కోరారు. మంచి పనులు చేపట్టే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

మదర్ థెరీసా విగ్రహ ప్రాంగణంలో మొక్క నాటుతున్న మంత్రి ఎర్రబెల్లి
అలాగే వల్మీడి గ్రామంలో నిన్న జరిగిన శ్రీ సీతారామచంద్ర దేవాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి బిషప్ రావడం పట్ల మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మదర్ థెరీసా విగ్రహ ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

