హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కొత్త ధరలను మదర్ డెయిరీ ప్రకటించింది. జీఎస్టీ సంసరణలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ కొత్త ధరలు ఈనెల 22నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
వినియోగదారులు ఎకువగా కొనుగోలు చేసే పనీర్, వెన్న, చీజ్, నెయ్యి, మిల్షేక్లు, ఐస్క్రీమ్స్ ధరలు తగ్గాయని వివరించింది. సాధారణ పాల ప్యాకెట్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నది.