హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇటీవల నిర్వహించిన మద ర్ డెయిరీ ఎన్నికల్లో డైరెక్టర్‌గా ఘన విజ యం సాధించిన సంధిలా భాస్కర్‌గౌడ్ సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భాస్కర్‌గౌడ్‌కు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగి డి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉన్నారు.