Shamirpet | కుటంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్పేట చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు బాబు, పాప మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన వారిగా గుర్తించారు. భానుప్రియ అనే మహిళ ఇద్దరు పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలతో కలిసి భానుప్రియ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు పిల్లల మృతదేహాలు చెరువులో తేలగా.. భానుప్రియ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెరువులో వేదాంశ్ ఆనంద్ (5), దీక్ష (4) మృతదేహాలు కనిపించాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.