కామారెడ్డి : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం(Missing) కావడం కామారెడ్డి జిల్లాలో(Kamareddy) కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..యాదరం భాను ప్రకాష్ దంపతులు కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. కాగా, కుటుంబ సభ్యులు అందరు కలిసి కామారెడ్డిలో షాపింగ్ చేశారు.
షాపింగ్ అనంతరం తన భార్య లయ(31) పిల్లలు శివ(13), బిందు(16), దివిజ(08) తిరిగి ఇంటికి రాలేదని భాను ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, కుటుంబ కలహాలతోనే నలుగురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.