కామారెడ్డి: కామారెడ్డి: కామారెడ్డి జిల్లా (Kamareddy) ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలో విషాదం చోటుచేసుకున్నది. చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వారిని రక్షించేందుకు చెరువులోకి దిగిన తల్లి కూడా నీటిలో మునిగి చనిపోయారు. మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు. మొదట పిల్లలంతా స్నానం చేసేందుకు చెరువులో దిగారు. అక్కడ భారీ గుంత ఉండటంతో వారు మునిగిపోయారు. పిల్లలను కాపాడేందుకు మౌనిక చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పిల్లల మృతదేహాలను వెలికితీయగా, మౌనిక కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మౌనిక తన పిల్లలతో కలిసి చెరువు వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లారని పోలీసులు వెల్లడించారు. పండుగ పూట కే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.