Vikarabad | కులకచర్ల, డిసెంబర్ 13 : చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా ఆ విషయం తెలిసి అతని తల్లి కుప్పకూలి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లిలో జరిగింది. లింగంపల్లికి చెందిన మ్యాకల శ్రీశైలం(34) గత నెల 24న పురుగులమందు తాగి ఆత్మహత్యకుయత్నించాడు.
అతను ఒక వీడియోలో తన చావుకు కారణం లింగంపల్లికి చెందిన బాల్‌రాజ్, లక్ష్మణ్, రాములుగా పేర్కొన్నాడు. అతను చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శ్రీశైలం మృతి విషయం తెలిసిన వెంటనే అతని తల్లి వెంకటమ్మ(52) ఉన్న చోటే కుప్పకూలి మృతి చెందింది. బాల్‌రాజ్, లక్ష్మణ్ రాములును పోలీసులు శుక్రవారం పరిగి సబ్‌జైలుకు పంపించారు.