సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో( Sangareddy) దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు తల్లీ, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా(Brutal murdered) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటనసంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని విరభద్రనగర్ కాలనిలో చోటు చేసుకుంది. తల్లీ, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన నాగరాజు (30) వ్యక్తి తన రెండేండ్ల కొడుకు మృతికి సరోజాదేవి (50)అనిల్ (30) అనే తల్లీ, కొడుకులు కారణమని అనుమానంతో కక్ష పెంచుకొన్నాడు. గురువారం నడిరోడ్డుపై కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చాడు. మృతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. హత్యకు పాతగొడవలే కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.