హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కరడుగట్టిన మోస్ట్ వాంటెడ్ నేరగాడు ఉప్పల సతీశ్‌ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ముంబైలో అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో జరిగిన పలు ఆర్థిక నేరాల్లో సతీశ్ కీలక నిందితుడు. రూ.23 కోట్ల ఆర్థిక నేరంలో అతని కోసం పోలీసులు గత 2 నెలలుగా గాలిస్తున్నారు. ఆ క్రమంలో గత నెల ముంబైలో పట్టుబడిన సతీశ్‌ను పోలీసులు తీసుకొస్తుండగా వికారాబాద్ వద్ద టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ సినీ ఫక్కీలో అతనిని తప్పించాడు. అందుకోసం సతీశ్ నుంచి శ్రీకాంత్ రూ.2 కోట్లు తీసుకోవడం సంచలనం రేపడంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆయనను సస్పెండ్ చేశారు.