మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గురుకులంలో బుధవారం 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని అంబులెన్సులో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఉదయం అల్పాహారంలో భాగంగా కిచిడీ చేసిన తర్వాత 10 గంటల సమయంలో పలువురు వాంతులు చేసుకున్నారు. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ విజయేందిరబోయి, అదనపు కలెక్టర్ విజయేంద్రప్రతాప్ గురుకులానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు, వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు.