Telangana | సిర్పూర్(టీ), సెప్టెంబర్ 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. దీంతో అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇండ్లకు పంపిస్తున్నారు.
ఇక్కడ 450 మంది విద్యార్థులు చదువుతున్నా రు. నాలుగు రోజుల క్రితం 30 మందికిపైగా జ్వరాల బారిన పడ్డారు. విడతల వారీగా పిల్లలను సిర్పూర్(టీ) సామాజిక దవాఖానకు తరలించినట్టు తెలుస్తున్నది. దవాఖానలో సరిపడా బెడ్లు లేక గురుకు ల పాఠశాల నుంచి తెప్పించి మరీ వాటిపైనే విద్యార్థులకు చికిత్స అందించారు. మంగళవారం నాటికి 100 మందికి జ్వ రాలు వచ్చినట్టు గుర్తించిన అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. సిర్పూర్(టీ) సామాజిక దవాఖానలో చికిత్స పొందుతున్న 10 మంది (మంగళవారం ఉదయం వరకు) విద్యార్థులను కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మంగళవారం పరామర్శించారు.