వాతావరణ మార్పులపై మరిన్ని పరిశోధనలు జరగాలి మంత్రి : అల్లోల
Minister Allola | కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్, జనవరి 20 : కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈపీటీఆర్ఐ రూపొందించిన క్యాలెండర్ -2022 ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ‘గ్రీన్ ఇన్షియేటివ్స్’ అనే ఇతివృత్తంతో పాటు ప్రతి నెల జరుపుకునే ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాల ఆవశ్యకతను ఈ క్యాలెండర్లో పొందుపరిచినట్లు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమతుల్య వాతావరణం కోసం, వాతావరణ మార్పులకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే విధంగా ఈపీటీఆర్ఐ పరిశోధనలు చేయాలన్నారు. ఉష్ణోగ్రతలు పెంచే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ల విడుదలను నియంత్రించాలి.
భవిష్యత్ తరాలు ఈ భూమిపై అవనిపై సుఖంగా జీవించేలా ఆధ్యాయనాలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునీలా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

