చెంచులకు అభివృద్ధి ఫలాలు అందాలి.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్
నల్లమల ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనులకు అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందాలే చూడాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా అమ్రాబాద్ మండలంలో బుధవారం ఆయన పర్యటించారు.
- అమ్రాబాద్ మండలంలో విస్తృత పర్యటన
అమ్రాబాద్, ఆగస్టు 5 : నల్లమల ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనులకు అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందాలే చూడాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా అమ్రాబాద్ మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. విష్ణుగిరిలో గిరిజన సంక్షేమంపై అధికారులతో ఆయన సమీక్షించి, చెం చుల హక్కుల పరిరక్షణతోపాటు జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభు త్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆదేశించారు.
అనంతరం బ్రహ్మగిరి ఉన్నత పాఠశాల, మల్లయ్యపెంటను సందర్శించి గిరిజన విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న భోజనం, వసతి, విద్యాసౌకర్యాలను పరిశీలించారు. చెంచుగిరిజనులతో ముఖాముఖి నిర్వహించి.. ఉపాధి అవకాశాలు, పిల్లల విద్య, విద్యుత్తు, గృహసదుపాయం, పెన్షన్ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వటవర్లపల్లి పీహెచ్సీని సందర్శించి అటవీ ప్రాంతాల నుంచి రోగులను తరలించే విధానాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పనిభారం తగ్గించాలని ధర్నా
- కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ నాయకుల ధర్నా
కల్వకుర్తి, ఆగస్టు 5 : ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సులను ఎక్స్ప్రెస్ బస్సులుగా నడిపిస్తుండటంతో కార్మికులపై పెరుగుతున్న పనిభారం తగ్గించాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం టీఎంయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు రవీందర్ మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల సమస్యలపై డీఎం, ఉన్నతాధికారులకు వినతులు అందజేస్తున్నా స్పందన లేదని, మేనేజ్మెంట్ స్పందించకుంటే రిలే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

