కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 5 : సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ (జేఎంఈటీ)లో ఉద్యోగులుగా చేరిన 600 మందికి ఓవర్మెన్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్‌చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీసు ఎదుట ఉద్యోగులు బుధవారం 72 గంటల నిరసన దీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016-17లో విధుల్లో చేరిన 800 మందికి 2023 వరకు ఓవర్మెన్లుగా ప్రమెషన్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 200 మందికి కల్పించారని, మిగిలిన 600 మందికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 72 గంటల నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. జేఎంఈటీల దీక్షలకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ మద్దతు తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 5 (నమస్తే తెలంగాణ): తెలుగు రచయిత మహ్మద్ ఖదీర్‌బాబుకు 2026 ‘బుక్ బ్రహ్మ’ సాహితీ పురస్కారం వరించినట్టు బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ డైరెక్టర్ సతీశ్ చప్పరికె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతీయ సాహిత్యానికి ఖదీర్‌బాబు చేసిన విస్తృత సేవకు గానూ బెంగళూరులో ఈ నెల 20 నుంచి 23 మధ్య నిర్వహించనున్న లిటరేచర్ ఫెస్టివల్లో ఈ పురస్కారాన్ని బహూకరిస్తామని పేర్కొన్నారు.

2024లో ఈ పురస్కారాన్ని ప్రారంభించగా.. తమిళ రచయిత జయమోహన్, 2025లో మళయాళ రచయిత్రి కేఆర్ మీనా అందుకున్నారు. పోలేరమ్మ బండ కథలు, న్యూబాంబే టైలర్స్, బియాండ్ కాఫీ, మెట్రో కథలు వెలువరించిన ఖదీర్ రైటర్స్ మీట్ స్థాపించి 25 ఏండ్లుగా యువ కథకులకు నిర్దేశనం చేస్తున్నారు. ఖదీర్ రెం డుసార్లు జాతీయ కథా పురస్కారాలు అందుకున్నారు. ఖదీర్‌కు బుక్‌బ్రహ్మ పురస్కారం ప్రకటించడంపై పలువురు సాహితీవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.