నందిగామ, సెప్టెంబర్ 8 : వ్యవసాయ రంగంలో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి, హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు భారత వ్యవసాయ వైస్ చాన్స్లర్ల జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ మాట్లాడుతూ.. సాగులో సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో 50 మందికిపైగా వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు, అధికారులు, ప్రొఫెసర్లు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నలిమెలకు కాళోజీ పురస్కారం ; నేడు రవీంద్రభారతిలో ప్రదానం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాసర్, కాళోజీ నారాయణరావు సాహితీ పురసారానికి ఎంపికయ్యారు. శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించే ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాహితీ పురసారాన్ని అందజేయనున్నది. పురస్కారం కింద రూ.1,01,116 నగదుతోపాటు జ్ఞాపికను అందజేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాసర్ తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన రచనల్లో అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక వంటి సంకలనాలు ప్రసిద్ధమైనవి. నలిమెలకు..14 భాషల్లో నైపుణ్యం ఉన్నది.