తిమ్మాజిపేట, ఫిబ్రవరి 15 : అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం బుద్ధసముద్రంలో చోటుచేసుకున్నది. డీఎస్పీ శ్రీనివాసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన బాలిక(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. శనివారం రాత్రి ఇంట్లో భోజనాలైన తర్వాత అందరూ నిద్రించారు.
కొద్దిసేపటి తరువాత బాలిక కనిపించక పోవడంతో ఆందోళనచెందిన కుటుంబ సభ్యు లు వెతుకుతుండగా.. గ్రామానికి చెందిన ఓ యువకుడితో మాట్లాడుతూ రాత్రి 10:30 గంటల సమయంలో అతడి బైక్పై ఎక్కివెళ్లినట్టు స్థానికులు తెలిపారు. ఆదివారం ఉద యం వారి పొలం వద్దే బాలిక విగత జీవిగా పడి ఉన్నది. బాలిక మృతికి సదరు యువకుడే కారణమంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతిరాలి ఒంటిపై ఎలాంటి గాయా లు లేకపోగా సమీపంలో రసాయనాలు ఉన్న ట్టు గుర్తించారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.