హైదరాబాద్‌లో వానలు.. మూసీకి పోటెత్తిన వరద
Moosi project | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లు
నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లు రెండు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,764.52 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 12,099 .18 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ఇప్పుడు 3.33 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉన్నది.
కాగా, భారీ వరదతో అనంతారం వద్ద మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. నదిలో 230.5 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. వదర ఉధృతి ప్రమాదకర స్థితిలో ఉన్నదని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాదాద్రి జిల్లాలోని భీమలింగంలో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీనది పారుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

