హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : వర్షాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నదని కేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచిందని వెల్లడించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రా ష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శు లు, కార్యదర్శులతో గురువారం సాయంత్రం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ..దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, విద్యుత్ లైన్లను పునరుద్ధ్దరించాలని ఆదేశించారు.