హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): ఆనాడు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించినవారే నేడు వార్షికోత్సవాల్లో జోరుగా సంబురాలు చేస్తున్నారని సెంటర్ ఫర్ పాలసీ అల్టర్నేటివ్ స్పీక్స్ చైర్మన్ మోహన్ గురుస్వామి అన్నారు.‘తెలంగాణ 10వ వార్షికోత్సవంలోని విచిత్రం ఏంటంటే… దాన్ని వ్యతిరేకించినవారే ఇప్పుడు జోరుగా సంబరాలు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు’ అని ఫేస్బుక్లో పేర్కొన్నారు.