హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ప్రభుత్వం మనువాద అంశాలతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ మండిపడ్డారు.
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో 4 రోజుల పాటు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి మాదగోని రవి మాట్లాడుతూ.. అక్టోబర్ 17న ఓంకార్ 14వ వర్థంతి సందర్భంగా బీసీ గణన చేయాలని, బీసీ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనే అంశంతో సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.