హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ-2026 నిర్వహణలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. నీట్ రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం తో దాదాపు 22లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని పే ర్కొన్నారు. గత పదేండ్లుగా ప్రధాని మో దీ హయాంలో 93రకాల పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశా రు. సుమారు రెం డు కోట్ల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయని తెలిపారు. నీట్ రద్దు నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని, కాంగ్రెస్ అండగా నిలుస్తుందని హామీనిచ్చారు.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): మార్క్సిస్టు సిద్ధాంంతం అజేయమైనదని, కిందపడ్డ ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తున్నదని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులను గురువారం ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఇంతకంటే పెద్ద ఆటంకా లు, ఊచకోత హత్యాకాండలను కూడా అధిగమించి కమ్యూనిస్టు ఉద్యమం పురోగమించిందని గుర్తుచేశారు.
ఆటంకాలు, ఇబ్బందుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, ఉవ్వెత్తున ఉద్యమం మళ్లీ పుంజుకోవటం అనేది అనివార్యమైన పరిణామమని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆ మూడు దేశాలకేగాక మొత్తం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదన్నారు. చైనా ఆధ్వర్యంలో అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక దక్షిణాది దేశాలు ఈ సమస్యపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయని తమ్మినేని పేర్కొన్నారు. కార్యక్రమానికి సీనియర్ నేత సారంపల్లి రంగారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రా రంభించగా..రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు రవికుమార్ అధ్యక్షత వహించారు. పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, ఎం డీ అబ్బాస్ జిలాల్ల నేతలు పాల్గొన్నారు.