హైదరాబాద్ జూలై 12 (నమస్తేతెలంగాణ): ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డి కుమ్మైక్కె బీసీ బిల్లులకు ఆమోదం లభించకుండా కుట్రలు చేస్తున్నారు.. వీరద్దరూ ముమ్మాటికీ బీసీ ద్రోహులేనని జనతంత్ర వేదిక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు నట్టేట ముంచిందని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రిజర్వేషన్ల అమలుపైనే 20 నెలల నుంచి కాలయాపన చేస్తున్నదని దుయ్యబట్టారు.