హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ 22న వాయుగుండంగా మారి, 23న తూర్పు- మధ్య బంగాళాఖాతంలో తుపానుగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 24న ఒడిశా, పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటి, వాయవ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారి, ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.