హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.