హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తేతెలంగాణ) : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. దీంతో పాటు పిడుగులు పడే అవకాశముంటుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగుతాయని వివరించారు. తెలంగాణకు ఆనుకొని ద్రోణి ఏర్పడిందని, ఉపరితల అవర్తనం కారణంగా రాష్ట్రంలో తేమ గాలులు వీస్తున్నాయని తెలిపారు.