హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మాడల్ స్కూల్స్ సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తుల సమర్పణ గడువు ఈ నెల 20తో ముగియనున్నది. సోమవారం వరకు మొత్తం 38,643 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు ఈ రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని మాడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి ప్రకటనలో కోరారు. ఏప్రిల్ 21న హాల్టికెట్లు విడుదల చేస్తామని, ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు సహా పూర్తి వివరాలకు https ://telanganams.cgg. gov. in వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.